ఢబుల్‌ ధమాకాతో ఫుల్‌ హ్యాపీ

Amala Paul get Chance in Nag and Nani Multistarrer movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అమలాపాల్‌ పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరం అయ్యింది. సినిమాలే తనకు ప్రాముఖ్యం అంటూ భర్త విజయ్‌కు విడాకులు ఇచ్చేసి మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత అమలాపాల్‌కు తెలుగులో ఆఫర్లు రాలేదు. తమిళంలో అడపా దడపా చిత్రాలు చేసిన ఈ అమ్మడు తెలుగులో ఆఫర్ల కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తుంది. ఎట్టకేలకు ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్‌ వచ్చింది. ఒక్క ఆఫర్‌ కోసం ఎదురు చూస్తున్న అమలాపాల్‌కు ఏకంగా రెండు ఛాన్స్‌లు దక్కాయి.

నాగార్జున మరియు నాని హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్‌ మూవీలో అమలా పాల్‌ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. భారీ అంచనాలున్న ఆ చిత్రంలో అవకాశం దక్కడంతో అమలాపాల్‌ ఫుల్‌ హ్యాపీ అయ్యింది. ఈ సమయంలోనే మరో బంపర్‌ ఆఫర్‌ అది కూడా మల్టీస్టారర్‌లో నటించే అవకాశం దక్కింది. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కబోతుంది. ఆ చిత్రంలో ఒక హీరోగా వెంకటేష్‌ నటించబోతున్నాడు, మరో హీరోగా వరుణ్‌ తేజ్‌ కనిపించబోతున్నాడు. వెంకీకి జోడీగా అమలా పాల్‌ను ఎంపిక చేయడం జరిగింది. మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఒకేసారి నటించే అవకాశం రావడంతో అమలాపాల్‌ ఢబుల్‌ ధమాకా ఛాన్స్‌ను కొట్టేసిందని అంతా అభినందనలు గుప్పిస్తున్నారు. ఆమె కూడా చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.