పది లక్షలకు కక్కుర్తి… ఇప్పుడు అష్టకష్టాలు

amala paul takes anticipatory bail for car registration issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
హీరోయిన్‌ అమలా పాల్‌ కారు రిజిస్ట్రేషన్‌ విషయం రోజు రోజుకు సీరియస్‌ అవుతుంది. ఆమె రిజిస్ట్రేషన్‌ ఫీజ్‌ను తగ్గించుకునేందుకు వేరే రాష్ట్రంలో తప్పుడు అడ్రస్‌తో రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. అలా చేయడం వల్ల ఆమెకు పది లక్షల రూపాల వరకు పన్ను తగ్గింది. అంతా సాఫీగా సాగిపోయింది అనుకుంటున్న సమయంలో అమలా పాల్‌కు షాక్‌ తలిగినట్లయ్యింది. కేరళకు చెందిన అమలా పాల్‌ తప్పుడు అడ్రస్‌తో కారును రిస్ట్రిర్‌ చేయించుకున్నారు అంటూ వెళ్లడి అయిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు అయ్యింది.

ఆమెను ఏ క్షణంలో అయినా పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. అందుకే ఆమె చెన్నై హై కోర్టులో ముందస్తు బెయిల్‌కు దరకాస్తు చేసుకోవడం జరిగింది. జైలుకు వెళ్లకుండా, అరెస్ట్‌ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆమె బెయిల్‌కు అప్లై చేసింది. అంటే అమలా పాల్‌ వద్దకు కేసుకు సంబంధించిన విషయం వెళ్లింది. అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని కూడా ఆమె నిర్థారణకు వచ్చింది. కేవలం పది లక్షల రూపాయలు తగ్గుతాయని అమలా పాల్‌ చేసిన పని ఇప్పుడు ఆమెను అష్ట కష్టాలు పెడుతుంది. ఈ సమస్య నుండి అమలా పాల్‌ ఎలా బయట పడుతుందో చూడాలి.