అజ్ఞాతవాసిలో అలీ లేకపోవడంపై వింత పుకార్లు

rumors-about-the-absence-of

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ ఏ చిత్రంలో నటించినా కూడా గత కొంత కాలంగా కామన్‌గా కనిపించే పాయింట్‌ అలీ అనే విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌ తన ప్రతి సినిమాలో కూడా అలీ ఉండాలని మరీ మరీ దర్శకుడితో చెబుతూ ఉంటాడు. అలీతో నటించడం తనకు చాలా సరదా అని, తప్పకుండా తన పాత్ర సినిమాలో ఉండాలని కోరుకుంటాను అంటూ స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ ఆ మద్య ఒక వేడుకలో చెప్పుకొచ్చాడు. అలాంటిది పవన్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’లో అలీ లేడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రంలో పవన్‌ లేడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే కొందరు మాత్రం సినిమా విడుదల కాకుండానే అలీ లేడు అంటూ ఎలా చెబుతారు అంటూ వాదిస్తున్నారు.

అలీ ఈ మద్య కాస్త ఎక్కువ ఘాటుగా మాట్లాడుతూ విమర్శల పాలు అవుతున్నాడు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ అలీని పక్కకు పెట్టి ఉంటాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం అలీ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆయన్ను పవన్‌ అజ్ఞాతవాసిలో ఎందుకు నటించలేదు అంటే మాత్రం సమాధానం దాట వేస్తున్నాడు. అంటే పవన్‌, అలీకి మద్య ఏదో వివాదం అయ్యింది లేదా మరేమైన సమస్యలు వచ్చి ఉంటాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలీ తీరు నచ్చక పోవడం వల్లే పవన్‌ ఆయన్ను దూరంగా ఉంచాడు అంటూ వస్తున్న పుకారు పిచ్చి పుకారు అంటూ మెగా ఫ్యాన్స్‌ కొట్టి పారేస్తున్నారు. ఇంతకు ఈ చిత్రంలో ఉన్నాడా? లేకుంటే ఎందుకు పవన్‌ చిత్రంలో అలీ లేడు? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.