మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ అదిరింది భయ్యా!

Sohel
Sohel

సోహెల్ హీరోగా చేసే సినిమాలో ఈసారి విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్. ఆగష్టు 18న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదల చేశాడు. టాటూ ఆర్టిస్ట్ గా జాలీ లైఫ్ లీడ్ చేస్తున్న సోహెల్ గర్భం దాల్చుతాడు. మగాడు గర్భం దాల్చడమేంటి? అని సమాజం చూస్తుంది. ఒక దశ వరకు ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తాడు.

అయితే సమాజం నుండి ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడం అంత సులభం కాదని తేలిపోతుంది. చివరికి ప్రేమించే వాళ్ళు, తల్లిదండ్రులు అందరూ భిన్నంగా చూసి అవమానిస్తారు. అసలు ఒక మగాడు ఎలా గర్భం దాల్చాడు? ప్రతి తల్లి తన బిడ్డ మీద ఎంత మమకారం పెంచుకుంటుందో అలాగే హీరో కథ ఎలా ముగిసిందనేది, మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చూస్తే కానీ తెలియదు.

కామెడీ, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ తెరకెక్కించారు. సోహెల్ కి జంటగా రూప కోడవయూర్ నటిస్తుంది. అలీ,వైవా హర్ష , బ్రహ్మాజీ, కీలక రోల్స్ చేశారు.రవిరెడ్డి ఎస్, అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు