‘నన్ను తేడా గాడు’ అన్నారని ఏడ్చేసిన సోహెల్..

tollywood actor sohel
sohel

అగ్ర యాంకర్ సుమ షో అంటేనే ఆ హంగామా వేరే లెవల్లో ఉంటుంది. సినిమా ఫంక్షన్స్,టీవీ షోస్, స్పెషల్ ఈవెంట్స్ ,ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ ఆమె హోస్ట్ చేస్తుందంటే ఇక చెప్పక్కర్లేదు. అప్పటికప్పుడు సందర్భానికి తగ్గట్టు పంచ్‌లు వెయ్యాలంటే సుమ తర్వాతే ఎవరైనా. తన క్రేజ్ వల్లే కొన్ని షోస్ రన్ అవుతున్నాయి. ఇక సుమ హోస్ట్ చేసే వాటిలో ఆమె పేరు మీద వచ్చే ‘సుమ అడ్డా’ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం కోసం ఎంతోమంది సెలబ్రిటీలతో ఓ ఆట ఆడుకుంటుంది .. ఈ వారంలో ఎప్పటిలానే నవ్వుల పువ్వులు పూయించనుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

సోహెల్ హీరోగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రమోషన్స్‌లో భాగంగా టీం షోలో పాల్గొన్నారు. శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ నటి సుహాసిని, రాజా రవీంద్ర,బ్రహ్మాజీ తదితరులు నటించారు. ఆగస్టు 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం సోహెల్,యాంకర్ దీప్తి, ఆలీ రెజా, రూప కలిసి సందడి చేశారు.ఇక ప్రెగ్నెంట్ అంటూ సుమ, సోహెల్‌ని ఆట పట్టించడం.. తిరిగి సోహెల్ కౌంటర్స్ ఇవ్వడం ఫన్నీగా అనిపించింది.

నవ్విస్తూనే, అందర్నీ కంటతడి పెట్టించాడు సోహెల్. తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.నన్ను యాక్సెప్ట్ చేస్తారా, లేదా? ‘జీవితంలో ఎలా ముందుకెళ్లాలి? రియాలిటీ షో నుంచి, చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు.. భయమేస్తుంటుంది.. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ గ్లింప్స్ విడుదల అయినప్పుడు చాలా మంది ఏందిరా వీడు తేడా గాడు అన్నట్లుగా మాట్లాడారు’ అంటూ కంటతడి పెట్టుకున్నాడు. దీంతో సుమతో సహా అందరూ ఎమోషనల్ అయ్యారు.