4వ తేదీన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న రెండు తెలుగు సినిమాలివే!

Pareshan-OTT-Release-On-SonyLIV
Pareshan-OTT-Release-On-SonyLIV

నాగశౌర్య హీరోగా ‘రంగబలి’ సినిమా రూపొందింది. ఈ సినిమాకి పవన్ బాసం శెట్టి దర్శకత్వం లో ,సుధాకర్ చెరుకూరి నిర్మించారు . నాగశౌర్య కి యుక్తి తరేజా జత కట్టగా ఈ సినిమా, జులై 7వ తేదీన థియేటర్లకు విడుదల అయ్యింది . సంగీతాన్నిపవన్ సీహెచ్ అందించగా ఈ సినిమా, కంటెంట్ పరంగా తీసిపారేయదగినదేం కాదు.
ఈ సినిమాలో సత్య కామెడీ .. హీరో మాస్ యాక్షన్ దృశ్యాలు .. హీరో ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ఈ నెల 4వ తేదీ నుంచి ‘నెట్ ఫ్లిక్స్’ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ నెల 4వ తేదీనే ‘పరేషాన్’ సినిమా ‘సోనీలివ్’ లో స్ట్రీమింగ్ కానుంది. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం లో తిరువీర్ కి పావని కరణం జత కట్టారు. సంగీతాన్నియశ్వంత్ నాగ్ అందించారు . ఈ సినిమా కామెడీ ప్రధానమైన కంటెంట్ జూన్ 2వ తేదీన థియేటర్స్ కి విడుదల అవ్వగా , ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది .