ఫుల్ రొమాంటిక్‌గా హీటు పెంచేస్తున్న ఖుషి!

Vijay Devarakonda
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ,సమంత లతో శివ నిర్వాణ ఓ మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఖుషి అంటూ శివ నిర్వాణ మరో అందమైన ప్రేమ కథను చెప్పేందుకు సిద్దంగా ఉన్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 1న రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ చేపట్టింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ చేశాడు. అందులో ట్రైలర్ రిలీజ్ డేట్, ట్రైలర్ నిడివి కూడా ఉంది.

ఇక విజయ్, సమంత పోస్టర్ మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.ఆగస్ట్ 9న ఖుషి ట్రైలర్ రాబోతోందని, రెండు నిమిషాల 41 సెకన్ల పాటు ఈ ట్రైలర్ ఉంటుందట. సెప్టెంబర్ 1న సినిమా రిలీజ్ కాబోతోందంటూ విజయ్ దేవరకొండ షేర్ చేశాడు. ఇక విజయ్ షేర్ చేసిన పోస్ట్ కంటే.. ఆ ఫోటో మీదే జనాల ఫోకస్ పడింది. ఆ ఫోటోలో విజయ్, సమంతలో మోస్ట్ రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు.

వారిద్దరి మధ్య చూస్తుంటే గాలి కూడా అటు నుంచి ఇటు రావడానికి గ్యాప్ లేనట్టుగా ఉంది.ఫుల్ రొమాంటిక్‌గా ఉంది..హీటు పెంచేస్తున్నారు.. అంటూ నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో శివ నిర్వాణ మాత్రం ఏదో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేలానే కనిపిస్తున్నాడు.

ఖుషి సినిమాకు సమంత, విజయ్ రొమాన్స్, కెమిస్ట్రీనే హైలెట్ అని ఇప్పటికే రిలీజ్ చేసిన పాటల ద్వారా అర్థం అవుతోంది. విజయ్, సమంతలు తెరపై జనాలను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. ఇప్పటికైతే ఈ జోడి మీద భారీ అంచనాలే ఉన్నాయి.విజయ్, సమంత, శివ నిర్వాణల భవిష్యత్తు ఖుషి సినిమాతో ఆధారపడి ఉంది.

లైగర్ సినిమాతో దారుణంగా దెబ్బతిని ఉన్నాడు విజయ్. శాకుంతలం వంటి డిజాస్టర్‌తో డీలా పడి ఉంది సమంత. టక్ జగదీష్ ఫ్లాపుతో శివ నిర్వాణ పాతాళంలోకి వెళ్లాడు. ఇక ఖుషి సినిమా ఈ ముగ్గురికి ఊపిరినిస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఖుషి సినిమా హిట్టయితే ఈ ముగ్గురి కెరీర్ మళ్లీ ఊపందుకుంటుంది.