ఒక సినిమా ఇలా ఆగిపోయింది.. ఆ సినిమా అలా దెబ్బకొట్టేసింది: డైరెక్టర్ పవన్ సాదినేని

Pawan Sadene
Pawan Sadene

పవన్ సాదినేని .. విభిన్నమైన కథలను తెరకెక్కిస్తుంటాడు,ఆయన దర్శకత్వంలో ఇంతకుముందు ‘సేనాపతి’ ‘ సావిత్రి’ ,’ప్రేమ ఇష్క్ కాదల్’ ..’వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘సేనాపతి’లో ప్రధానమైన పాత్రను పోషించిన రాజేంద్రప్రసాద్, పవన్ సాదినేనికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘దయా’ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. తాజాగా ‘ఫిల్మ్ ట్రీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ‘సావిత్రి’ కథ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడిని. ఆ సినిమా నారా రోహిత్ చేసిన ప్రయత్నంగా భావించాను.

అయితే ఫలితం దగ్గరికి వచ్చేసరికి దెబ్బకొట్టేసింది. కల్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నాను ,హరికృష్ణగారి మరణం కారణంగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు” అని అన్నారు. “బెల్లంకొండ గణేశ్ ను హీరోగా నేను పరిచయం చేయవలసింది. ఆయన హీరోగా 20 రోజుల పాటు షూటింగు కూడా చేశాము.

ఆ తరువాత కరోనా విరుచుకుపడింది .. రెండేళ్ల వరకూ ఆ ప్రాజెక్టు జోలికి వెళ్లలేకపోయాము. ఆ తరువాత కమిట్ మెంట్స్ మారిపోయాయి. తీసిన పుటేజ్ కూడా పనికిరాకుండా పోయింది” అంటూ చెప్పుకొచ్చారు.