ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నారా రోహిత్ 20 అనౌన్స్ మెంట్ గ్లింప్స్..!

Glimpses of Nara Rohit 20 announcement with interesting title..!
Glimpses of Nara Rohit 20 announcement with interesting title..!

ప్రస్తుతం ప్రతినిధి 2 సినిమా చేస్తున్నారు నారా రోహిత్. ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక నేడు శ్రీరామ నవమి సందర్భంగా తన నెక్స్ట్ సినిమా అయిన కెరీర్ 20వ మూవీని అనౌన్స్ చేసారు నారా రోహిత్. ఈ లవ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కి సుందరకాండ అనే టైటిల్ ఫిక్స్ చేసి కొద్దిసేపటి క్రితం టైటిల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసారు.

ఏ రెండు కథలు ఒకేలా ఉండవు, ఏ ఇద్దరు ఒకేలా ప్రేమించలేరు అని అంటూ పలు సక్సెస్ఫుల్ మూవీ ల్లోని ప్రేమ కథలని హీరో రోహిత్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇస్తూ రూపొందిన ఈ టైటిల్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంతుంది . ఇక రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక చేతిలో పూల కుండి, మరొక చేతిలో పుస్తకం పట్టుకుని ఉన్న నారా రోహిత్ లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తంగా సుందరకాండ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంతుంది .

Glimpses of Nara Rohit 20 announcement with interesting title..!
Glimpses of Nara Rohit 20 announcement with interesting title..!

ఇక ఈ సినిమాని వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తుండగా సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి గ్రాండ్ లెవెల్లో దీనిని నిర్మిస్తుండగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 6న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇందులో వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.