ప్రియదర్శి – నభా నటేష్ నెక్స్ట్ సినిమా డార్లింగ్!

Smart Shankar Beauty Nabha Natesh, Nikhil Siddhartha
Smart Shankar Beauty Nabha Natesh, Nikhil Siddhartha

చాలా గ్యాప్ తర్వాత, ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్, నిఖిల్ సిద్ధార్థ ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా, స్వయంభు సెట్స్‌లో చేరిపోయింది ఈ మూవీ ఒక పక్క షూటింగ్ జరుగుతుండగా, మరొక పక్క నభా నటేష్ పోస్ట్ చేసిన వీడియో ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. నిన్న ఆమె ఒక వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఆమె ప్రభాస్‌ ఎక్కువగా వాడే డార్లింగ్ అనే పదాన్ని, స్లాంగ్ అనుకరించింది.

నటుడిగా తన సత్తాని నిరూపించుకున్న ప్రియదర్శి, నభాను డార్లింగ్ అని పిలిచి సరదాగా ఆట పట్టించాడు. ఇది ప్రమోషనల్ స్టంట్ అని చాలామంది ఊహించారు. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఇదంతా మూవీ లో భాగమే. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా డార్లింగ్ అనే మూవీ లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ దర్శకుడు అశ్విన్‌రామ్‌ ఈ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించనున్నాడు.

ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీ కావడంతో, ఆ మూవీ ప్రమోషన్ కోసం టీమ్ పరోక్షంగా అతడిని ఉపయోగించుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నది .