లేటెస్ట్ అప్డేట్ : మళ్ళి వాయిదా పడిన “ప్రతినిధి 2”

Latest Update : “prathinidhi 2” Postponed Again
Latest Update : “prathinidhi 2” Postponed Again

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఫిల్మోగ్రఫీ మంచి ఆసక్తిగానే ఉంటున్నది . ప్రస్తుతం తనకి సరైన హిట్ లేదు కానీ తన మొదటి మూవీ నుంచి కూడా విభిన్న కథాంశాలతో రోహిత్ ఆకట్టుకునే ప్రయత్నం మాత్రం చేసాడు. మరి అలాంటి మూవీ ల్లో పొలిటికల్ సూపర్ హిట్ మూవీ “ప్రతినిధి” కూడా ఒకటి. మరి దానికి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ గా అది కూడా జర్నలిస్ట్ మూర్తి దర్శకునిగా మారి చేసిన మూవీ నే “ప్రతినిధి 2”.

Latest Update : “prathinidhi 2” Postponed Again
Latest Update : “prathinidhi 2” Postponed Again

ఇది వరకే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకి ఈ ఏప్రిల్ 25న రిలీజ్ రావాల్సి ఉన్నది . కానీ లేటెస్ట్ గా మేకర్స్ ఈ డేట్ లో కూడా ఈ మూవీ ఆగినట్టు కన్ఫర్మ్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసారు. మరి ఈ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ మూవీ లో సిరి లెల్ల హీరోయిన్ గా నటించగా వానర ఎంటర్టైన్మెంట్స్ అలాగే రానా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.