పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్.

Allu Arjun
Allu Arjun

పుష్ప ది రూల్ గా వస్తున్న ఈ సినిమా నుంచి చాలా రోజులుగా ఎటువంటి అప్డేట్ రాలేదని చెప్పాలి. కానీ ఈ సినిమా నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూలు త్వరలో హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం కానుందట. ముఖ్యంగా అల్లు అర్జున్ తో పాటు ఇతర కీలక నటులపై వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్లో షూట్ చేయబోతున్నట్లు సమాచారం.

పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా షేకావత్ సింగ్ గా కనిపించిన ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇకపోతే రెండవ పార్ట్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే అల్లు అర్జున్ , జగపతిబాబుతో వచ్చే యాక్షన్ సీన్ మరింత అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇకపోతే ఈ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ కి చెందిన ఒక టీం పర్యవేక్షణలో షూటింగ్ చేయబోతున్నారట. ఇక రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా,సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు . మైత్రి మూవీ మేకర్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్లో రష్మిక జాయిన్ అవుతున్నట్లు రీసెంట్గా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే మొదటి భాగంతో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు రెండవ భాగంతో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తారో తెలియాల్సి ఉంది