ఊరించి ఉసూరుమనిపించారు..!

nani mca and akhil hello movie negative public talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత రెండు నెలలుగా క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతున్న నాని ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’, అఖిల్‌ ‘హలో’ చిత్రాల గురించి ప్రేక్షకులు ఎదురు చూశారు. ఒక్క రోజు తేడాతో ఈ రెండు చిత్రాలు కూడా బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాని రెండు నెలలుగా ఎదురు చూస్తుంటే ఈ చిత్రాలు రెండు వారాలు కూడా ఆడే పరిస్థితి కనిపించడం లేదు. క్రిస్మస్‌ ఇంకా రాకుండానే ఈ చిత్రాలు విడుదలై నెగటివ్‌ టాక్‌ను తెచ్చుకున్నాయి. విడుదలైన రెండు చిత్రాలపై ఉన్న అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయారు. నాని, అఖిల్‌ ఇద్దరు కూడా తమ అభిమానులను నిరాశ పర్చారు.

అఖిల్‌ రెండవ చిత్రం ‘హలో’తో తప్పకుండా సూపర్‌ హిట్‌ దక్కించుకోవడం ఖాయం అని అంతా భావించారు. కాని షాకింగ్‌గా హలో చిత్రం ఒక రొటీన్‌ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తెరకెక్కించాడని, స్టోరీ లైన్‌ చాలా మూసగా ఉందని, ఇలాంటి స్టోరీలతో ఎన్నో చిత్రాలు వచ్చాయని ప్రేక్షకులు తీసి పారేస్తున్నారు. ఇక నాని నుండి చాలా గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులు ఆశించారు. సాయి పల్లవి, నాని, దిల్‌రాజుల కాంబో మూవీ అనగానే అంచనాలు భారీగా వచ్చాయి. కాని అంచనాలు తారు మారు అయ్యాయి. దిల్‌రాజు బ్యానర్‌లో డబల్‌ హ్యాట్రిక్‌కు గండి పడ్డట్లయ్యింది. పర్వాలేదు అనే టాక్‌ వచ్చినా కూడా ‘ఎంసీఏ’కు ఓపెనింగ్స్‌ బాగున్నాయనే టాక్‌ వినిపిస్తున్నాంది. మొత్తానికి అయితే నాని మరియు అఖిల్‌లు ఇద్దరు కూడా ఊరించి ఉసూరుమనిపించారు.