రెండవ పెళ్లి విషయంలో నిర్ణయం వారిదే…!

Amala Paul Ready For Second Marriage

హీరోయిన్‌ అమలాపాల్‌ తమిళ స్టార్‌ డైరెక్టర్‌ విజయ్‌ను చాలా సంవత్సరాలు ప్రేమించి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో వారిద్దరు విడిపోయారు. పెళ్లి తర్వాత అమలాపాల్‌ను సినిమాలు మానేయమంటూ విజయ్‌ కుటుంబ సభ్యులు కోరగా, అందుకు అమలా పాల్‌ నో చెప్పిందట. దాంతో విడాకుల వద్దకు వివాదం వెళ్లింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. విడాకుల తర్వాత మళ్లీ హీరోయిన్‌గా వరుసగా చిత్రాలు చేసేందుకు అమలాపాల్‌ ప్రయత్నాలు చేస్తోంది. హిందీ మరియు తమిళ చిత్ర పరిశ్రమల్లో ఈమెకు ఛాన్స్‌లు దక్కే అవకాశం ఉంది.

wedding

ఈ సమయంలో ఒక మీడియా సమావేశంలో అమలాపాల్‌ మాట్లాడుతూ.. తాను రెండవ పెళ్లి చేసుకుంటాను అంది. అయితే ఆ రెండవ పెళ్లి ఇప్పట్లో ఉండదని, ప్రస్తుతం తాను పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెడుతున్నాను, భవిష్యత్తులో రెండవ పెళ్లి చేసుకుంటాను అంటూ అమలా పాల్‌ చెప్పింది. రెండవ పెళ్లి ఎప్పుడు చేసుకున్నా కూడా నేను ఖచ్చితంగా ఈసారి తల్లిదండ్రుల మాట ప్రకారం నడుచుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. మొదటి సారి సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టపోయాను. నా నిర్ణయం సరైనది కాదని ఆ తర్వాత తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు రెండవ పెళ్లి విషయాన్ని పూర్తిగా వారికే వదిలి వేస్తున్నాను. వారి ఎవరిని చేసుకోమంటే వారిని పెళ్లి చేసుకునేందుకు నేను సిద్దం అంటూ అమలా పాల్‌ ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది.

Vijay-Ex-Wife-Ready-For-Sec