అంబాజీపేట బ్యాండు ఓటిటిలోకి రాబోతోంది!

Ambajipet band is coming to OTT!
Ambajipet band is coming to OTT!

సుహాస్ హీరోగా శివాని నగరం హీరోయిన్ గా దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, యాక్షన్ ఎమోషనల్ సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుని మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ సినిమా యొక్క ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

Ambajipet band is coming to OTT!
Ambajipet band is coming to OTT!

ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ఈ సినిమా లో మార్చి 1 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ని ధీరజ్ మొగిలినేని ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గోపరాజు రమణ, జగదీశ్ ప్రతాప్ బండారి, స్వర్ణకాంత్ తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమా ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ను అలరిస్తుందో చూడాలి.