ఇక నావల్ల కాదన్న బిగ్‌బి.. మరి ప్రత్యామ్నాయం ఏంటి?

amitabh bachchan finds alternative to kaun banega crorepati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశ వ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాధరణ ఉన్న గేమ్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌ పతి. ఈ షోను గత పది సంవత్సరాలుగా అమితాబ్‌ హోస్ట్‌ చేస్తున్నాడు. సినిమాల్లో వీక్‌ అయిన సమయంలో అమితాబచ్చన్‌కు ఈ షో చేసే అవకాశం రావడం జరిగింది. ఈ షోతో మళ్లీ సినిమాల్లో ఆయన మెగాస్టార్‌ అయ్యాడు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే తనకు కౌన్‌ బనేగా కరోడ్‌ పతి వల్లే ఎక్కువ గుర్తింపు వచ్చిందని అమితాబ్‌ అంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్‌లను పూర్తి చేసి ప్రస్తుతం తొమ్మిదవ సీజన్‌ను చేస్తున్న అమితాబచ్చన్‌ ఆ సీజన్‌తో కౌన్‌బనేగా కరోడ్‌ పతికి గుడ్‌ బై చెప్పే అవకాశం కనిపిస్తుంది.

ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌ చివరి ఎపిసోడ్‌ల చిత్రీకరణ జరుగుతుంది. ఈ సందర్బంగా ఆయన తన బ్లాక్‌లో ఏక ధాటిగా మాట్లాడుతూ ఉండటం వల్ల తన స్వరపేటిక తీవ్రంగా నొప్పి పెడుతుందని, కనీసం మంచి నీళ్లు, ఆహారం కూడా మింగకుండా తన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చాడు. యాంటీ బయోటిక్స్‌ మరియు పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని మరీ చివరి ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఈ షో తనను ప్రేక్షకులకు దగ్గర చేసింది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీసిందని బిగ్‌బి బాధపడుతూ చెప్పాడు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే వచ్చే సీజన్‌ చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే బిగ్‌బి ఈ షో నుండి పూర్తిగా తప్పుకోవచ్చు అనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

ఒక వేళ అమితాబచ్చన్‌ ఈ షోను వదిలేస్తే ఆస్థాయిలో ఆకట్టుకోగల సత్తా ఏ స్టార్‌కు లేదు. హిందీలో సక్సెస్‌ అయిన ఈ షో పలు భాషల్లో రీ మేక్‌ చేశారు. ఏ భాషలో అయినా కూడా ఈ షో పెద్దగా సక్సెస్‌ కాలేదు. అలాగే అమితాబచ్చన్‌ కాకుండా మరెవ్వరు ఈ షోను చేసినా కూడా ప్రేక్షకులు ఆధరించరు అని షో నిర్వాహకులు కూడా భావిస్తున్నారు. ఈ సమయంలో షో నిర్వాహకులు ఏం చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్‌బి స్థానంను అభిషేక్‌ బచ్చన్‌తో పూర్తి చేయాలని కొందరు కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందా చూడాలి. అభిషేక్‌ కాకున్నా కనీసం ఐశ్వర్య రాయ్‌ అయినా పర్వాలేదని కొందరు భావిస్తున్నారు.