విశాల్‌పై మోడీ కక్ష సాధింపు?

Modi takes revenge on hero Vishal

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తమకు వ్యతిరేకంగా నడుచుకునే వారిపై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించడంలో ఏమాత్రం వెనుకాడటం లేదు. తాము అనుకున్నది చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎంతటి వారిని అయినా అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘మెర్సల్‌’ చిత్రంలో జీఎస్టీకి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్‌ ఉన్న విషయం తెల్సిందే. ఆ డైలాగ్స్‌ బీజేపీకి ఆగ్రహం తెప్పించాయి. దాంతో ఆ డైలాగ్స్‌ తొలగించే వరకు సినిమాను ఆడనిచ్చేది లేదు అంటూ బీజేపీ నాయకులు పట్టు బట్టారు. మెర్సల్‌ చిత్రానికి కొందరు సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. వారిలో విశాల్‌ ఒక్కడు.

నిర్మాతల మండలి తరపున మెర్సల్‌ చిత్రానికి విశాల్‌ బాసటగా నిలవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాలో ఉన్న డైలాగ్‌ను తొలగించాల్సిన అవసరం లేదని విశాల్‌ నిర్మాతకు సూచించడం జరిగింది. కాని బీజేపీ ఒత్తిడితో పాటు కేంద్రంతో పెట్టుకోవడం ఎందుకని భావించిన మెర్సల్‌ నిర్మాత ఆ డైలాగ్స్‌ను తొలగించేందుకు సిద్దం అయ్యాడు. ఆ డైలాగ్స్‌ను తొలగించిన తర్వాత ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ విషయమై విశాల్‌ నిర్మాతపై ఆగ్రహంగా ఉన్నాడు.

వారి బెదిరింపులకు బయపడి డైలాగ్స్‌ను తొలగించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందతా కూడా కేంద్ర ప్రభుత్వం గమనిస్తూనే ఉంది. మోడీ అండ్‌ కో విశాల్‌ తీరును తీవ్రంగా ఆక్షేపించింది. తమకు వ్యతిరేకంగా విశాల్‌ పని చేస్తున్నాడని వారికి అర్థం అయ్యింది. అందుకే విశాల్‌కు తమ అధికారం పవర్‌ చూపించాలనే ఉద్దేశ్యంతో ఐటీ దాడులు చేయించింది. విశాల్‌ నిర్మాణ సంస్థ అయిన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీపై ఐటీ దాడులు జరిగిన విషయంపై అధికారిక ప్రకటన వెలువడినది. విశాల్‌ ప్రభుత్వంకు 51 లక్షల పన్నులు బకాయి ఉన్నాడు. ఆ మొత్తం చెల్లించాల్సిందిగా ఐటీ నోటీసులు ఇచ్చేందుకు తాము వెళ్లినట్లుగా ఐటీ అధికారులు చెబుతున్నారు. ఇలా నోటీసులు ఇప్పించి విశాల్‌ను కేంద్రం భయపెట్టాలని ప్రయత్నిస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు.