‘భాగమతి’ గురించి ఆసక్తికర వార్త.. నిజమైతే పండగే

Latest updates about movie Bhagmati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి 2’ చిత్రంలో నట విశ్వరూపం చూపించిన అనుష్క ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు ఏవీ కూడా బయటకు రాకుండా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా సినిమాకు సంబంధించిన విషయాలు ఒక్కటి ఒక్కటిగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్న ‘భాగమతి’ చిత్రం అనుష్క కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అనుష్క ఈ చిత్రంలో పోషిస్తున్న పాత్ర మునుపెన్నడు పోషించనటువంటి పాత్ర అంటూ చెప్పుకొస్తున్నారు.

అనుష్క ‘అరుంధతి’ చిత్రంలో డబుల్‌ రోల్‌ చేసిన విషయం తెల్సిందే. మళ్లీ ఇన్నాళ్లకు అనుష్క ఈ చిత్రంలో డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదొక సోషియో ఫాంటసీ చిత్రం అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అనుష్క రెండు విభిన్న తరహా పాత్రల్లో కనిపించబోతుంది. అశోక్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తాజాగా యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు ప్రకటించారు.

ఈ చిత్రాన్ని నవంబర్‌ లేదా డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభాస్‌ ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. వైవిధ్యభరితంగా ఈ చిత్రం ఉండటంతో పాటు అనుష్క కెరీర్‌లోనే ఈ చిత్రం నిలిచి పోయేలా ఉంటుందంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రెండు పాత్రల్లో కూడా అనుష్క అద్బుతమైన నటనను కనబర్చిందని వారు అంటున్నారు. చివరి దశ షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మరికొన్ని వారాల్లోనే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.