వెబ్ సిరీస్ వివాదంలోకి అనుష్క

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ నిర్మాణంలో పాట‌ల్ లోక్ అనే వెబ్ సిరీస్ రూపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ గోర్ఖా క‌మ్యూనిటీ మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉంద‌ని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గూర్ఖా కమ్యూనిటీ గ్రూప్ అనుష్కపై ఫిర్యాదు చేశారు.

గూర్ఘా కమ్యూనిటీ ఏమంటుంది అంటే.. అనుష్క వెబ్ సిరీస్‌లో సమాజానికి వ్యతిరేకంగా చేసిన “సెక్సిస్ట్ స్లర్” ఆరోపణలపై ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్ మే 18న ఆన్‌లైన్‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)కు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఈ వారం ప్రారంభంలో.. భారతీయ గూర్ఖా పరిసంఘ్ యువజన విభాగం అయిన భారతీయ గోర్ఖా యువ పరిసంఘ్ (భాగోయూప్) కూడా ఒక నిర్దిష్ట దృశ్యాన్ని తొల‌గించాల‌ని డిమాండ్ చేసింది. అలాగే.. ఒక మహిళా పాత్రకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉపయోగించారని.. ఆమె పేరు మేఘాలయలోని ఖాసీ వర్గానికి చెందినదని స్పష్టం చేస్తుంది. కాగా వెబ్ సిరీస్ రెండవ ఎపిసోడ్‌లోని క్లిప్ సమాజానికి వ్యతిరేకంగా జాత్యహంకారాన్ని చూపిస్తోంద‌ని కూడా గూర్ఖా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే వీటిపై అనుష్క ఇంతవరకు ఎలాను స్పందించలేదు. ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.