మరి తెలుగులో ఎప్పుడు?

Anushka Next movie in Gautham Vasudev Menon Direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన అనుష్క ‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్‌లో సైతం క్రేజ్‌ను దక్కించుకుంది. ‘బాహుబలి’ తర్వాత అందరికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. అంతా చకచక సినిమాలు చేస్తున్నారు. కాని అనుష్క మాత్రం బాహుబలి చిత్రం తర్వాత పెద్దగా సినిమాలకు కమిట్‌ అవ్వడం లేదు. బాహుబలి చేస్తున్న సమయంలోనే ఒప్పుకున్న భాగమతి చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో అనుష్క బరువు తగ్గిన తర్వాతే కొత్త సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. అందుకే ఇన్నాళ్లు సినిమాలకు కమిట్‌ కాకుండా ఉంది.

ఇటీవలే అనుష్క తమిళంలో గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అనుష్క రీ ఎంట్రీ భారీగా ఉండేలా ఆయన ప్లాన్‌ చేస్తున్నాడు. దాదాపు సంవత్సరం తర్వాత అనుష్క సినిమా చేయనున్న కారణంగా అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా మలయాళంలో మమ్ముటి సరసన ఒక చిత్రాన్ని చేసేందుకు కూడా అనుష్క ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. తమిళం మరియు మలయాళంలో సినిమాు కమిట్‌ అయిన అనుష్క తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. తెలుగులో ఏ స్టార్‌ హీరో కూడా అనుష్కతో నటించేందుకు ఆసక్తిగా లేరు. అందుకే ఆమె ఒకవేళ తెలుగులో నటిస్తే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం అవ్వాల్సిందే. మరి తెలుగులో మరో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రానికి ఆమె ఓకే చెబుతుందా అనేది చూడాలి.