విరుష్కలుగా చైతూ, సమంతలు?

Shiva Nirvana inspired the story of Virushka for Naga Chaitanya and Samantha

ఇండియన్‌ క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మలు సుదీర్ఘ కాలం ప్రేమలో మునిగి తేలి ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం వీరిద్దరి కథ ఆధారంగా తెలుగులో ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు శివ నిర్వాన ఏర్పాట్లు చేస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక క్రికెటర్‌ జీవితంలో సినీ తార ఎంటర్‌ అవ్వడంతో ఆయన జీవితంలో కలిగిన మార్పులు ఏంటీ అనే స్టోరీ లైన్‌తో ఈయన కథను రెడీ చేసుకున్నాడు. ఈ స్టోరీ లైన్‌ చూస్తుంటే విరుష్కల ఉదంతం గుర్తుకు వస్తుందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్‌ శివ వారి జీవితాన్ని, ప్రేమ కథను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండవచ్చు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

టాలీవుడ్‌ లవ్‌ కపుల్‌ నాగచైతన్య, సమంతలు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. పెళ్లి తర్వాత కోన వెంకట్‌ బ్యానర్‌లో వీరిద్దరు కలిసి నటించేందుకు ఓకే చెప్పడం జరిగింది. శివ నిర్వాన విరుష్క రియల్‌ లైఫ్‌ ప్రేమ కథను ఈ చిత్రంలో వీరిద్దరితో చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నాగచైతన్య ప్రస్తుతం క్రికెట్‌లో మెలకువలు నేర్చుకుంటున్నాడు. క్రికెటర్‌గా తాను కనిపించేందుకు రెడీ అవుతున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆ సమయంలోనే సమంత తన రియల్‌ లైఫ్‌ పాత్రలోనే కనిపిస్తుందనే అభిప్రాయంను వ్యక్తం చేశాడు. అందుకే ఈ చిత్రం విరుష్కల రియల్‌ లవ్‌ స్టోరీ అంటూ ప్రచారం జరుగుతుంది. అధికారికంగా కాకున్నా అనధికారికంగా అయినా ఈ కథ వారిదే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. మరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు అసలు విషయం అనేది తెలియదు.