ఒక హీరోయిన్ మీద ఐదేళ్ళ నిషేధం… భయంలో ఆ ఇద్దరు హీరోయిన్లు

New Twist in Tollywood Heroines Sex Racket in America

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళను అరెస్టు చేశారు. అయితే ఆ కేసుకు సంబంధించి 42 పేజీల ఫిర్యాదును నమోదు చేసినట్టిగా తెలుస్తోంది. చికాగో జిల్లా కోర్టులో ఈ కేసును విచారిస్తున్నారు. రహస్యంగా సెక్స్ రాకెట్ నడిపిన కిషన్… టాలీవుడ్ నుంచి కనీసం అయిదు మంది హీరోయిన్లను వ్యభిచారంలోకి దించినట్లు తేలింది. సెక్స్ రాకెట్‌లోకి దిగిన ప్రతి తారకి చెందిన అకౌంట్ వివరాలు అన్నీ కిషన్ దగ్గర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడెక్కడ కస్టమర్‌ను కలుసుకున్నారు, ఎవరి వద్ద ఎంత వసూలు చేశారన్న అంశాలన్నీ కిషన్ దగ్గర ఉన్నాయి.

కిషన్ మోదుగుమూడి-చంద్ర దంపతులు కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్, కోలీవుడ్, సాండిల్ వుడ్ హీరోయిన్లకు వీసాలు ఇప్పించి వ్యభిచారం చేయిస్తున్నారని రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే ఆ నివేదికలో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్స్ పేర్లను బయటపెట్టకుండా వారు వ్యభిచారం చేశారని ప్రస్తావించారు. ఆ ఇద్దరి హీరోయిన్లు వీరేనంటూ తాజాగా మీడియాకు లీకులు అందాయి. ఈ ఇద్దరు హీరోయిన్లు పలు హాట్ హాట్ సినిమాల్లో అందాలు ఆరబోసిన వారే… ఒక హీరోయిన్ ఏమో ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేసింది.

మరో హీరోయిన్ అయితే తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడితో డేటింగ్ చేస్తోందని కథనాలు వెలువరించారు. ఈ వార్తలు జాతీయ స్థాయిలో బయటకు రావడంతో సదురు హీరోయిన్లలో టెన్షన్ మొదలైంది. అలాగే ఈ వ్యహారంలో బాధితురాలుగా ఉన్న హీరోయిన్ (విక్టిమ్-ఎ)పై అమెరికా ఐదేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం. ఉన్న తెలుగు, కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన విక్టిమ్-ఎగా ఉన్న నటికీ మంజూరైన యూఎస్ వీసాపై డిసెంబర్ 26, 2017న నిషేధం విధించారని, అది తెలియక మార్చిలో ఆమె అమెరికా వెళ్లిన తర్వాత ఈ విషయం తెలిసి షాకైనట్లు సమాచారం. యూఎస్ఏలోకి ఆమెను అనుమతించక పోవడంతో ఆ రోజు ఎయిర్‌పోర్టులో పడుకుని తిరిగి బెంగుళూరు వచ్చిందట. హైదరాబాద్‌లో ఉన్న సదరు హీరోయిన్‌ను యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు సెక్స్ రాకెట్‌ విషయంలో విచారణకు తన లాయర్‌తో కలిసి హాజరైన ఆమె తనపై బ్యాన్ ఎత్తివేయాలని అధికారులను వేడుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తమ చేతుల్లో ఉండదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఆమె పేరు బయటకు రాకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడా బాధిత హీరోయిన్ల పేర్లు బయటకు రాకపోవడంతో అన్ని మీడియా వర్గాలు ఊహాగాన వార్తలతోనే కాలం వెళ్ళ దీస్తోంది.