ఓ ప‌క్షీ… నీ నివాసం ఎక్క‌డ‌..?

Amitabh Bachchan written poem to Twitter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఇటీవ‌ల త‌న రెండు లక్ష‌ల మంది ఫాలోవ‌ర్ల‌ను ట్విట్ట‌ర్ తొల‌గించింద‌ని, ఈ సోష‌ల్ మీడియా నుంచి తాను త‌ప్పుకుంటాన‌ని బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ హెచ్చ‌రించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది. అయితే ట్విట్ట‌ర్ నుంచి త‌ప్పుకుంటాన‌న్న ఆయ‌న ఆ త‌ర్వాత ఇత‌ర సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను ఫాలో అవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ క్ర‌మంలో మ‌రోసారి ట్విట్ట‌ర్ పై స్పందించారు బిగ్ బి. ఈ సారి బుల్లిసందేశాల మాధ్య‌మంపై ఆయ‌న త‌న‌దైన స్ట‌యిల్ లో ఓ క‌విత అల్లారు. ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన అమితాబ్ క‌విత‌… వైర‌ల్ గా మారింది. బిగ్ బి క‌విత ఇలా సాగింది…

ట్విట్ట‌ర్… నేను ఏద‌న్నా పోస్ట్ చేద్దామ‌నుకుంటే నువ్వు న‌న్ను అనుమ‌తించ‌డం లేదు. ఇప్ప‌టికే నా 2ల‌క్ష‌ల‌మంది ఫాలోవ‌ర్ల‌ను త‌గ్గించేశావ్. క‌నీసం నేను నీకోసం పోస్ట్ చేసిన క‌విత్వాన్ని మాత్రం తొల‌గించకు. నాతో ఇంత దారుణంగా ప్ర‌వ‌ర్తించ‌కు. ఓ ప‌క్షీ… నీ నివాసం ఎక్క‌డ‌..? ఎగురుకుంటూ ఇక్క‌డ‌కు వ‌చ్చావు. నీకు ఎంద‌రో అభిమానులున్నారు. భ‌య‌మ‌నేదే లేదు నీకు. కానీ నీకు కోపం వ‌స్తే మేము ఎక్క‌డికి వెళ్లాలి? నీ ఆశీర్వాదాలు మా పై ఉంటే మా ప‌దాల‌ను పువ్వుల్లా నీపై కురిపిస్తాం అంటూ స‌ర‌దా క‌విత పోస్ట్ చేశారు అమితాబ్. ఈ క‌విత్వం చూసిన నెటిజ‌న్లు కూడా స‌ర‌దా కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బి క‌విత చూసిన త‌ర్వాతైనా… ట్విట్ట‌ర్ తొల‌గించిన ఫాలోవ‌ర్ల‌ను తిరిగి అమితాబ్ కు ఇచ్చేస్తుంద‌ని కామెంట్ చేస్తున్నారు.

Amitab Poem