‘అమ్మమ్మగారిల్లు’ ప్రివ్యూ

Ammammagarillu Movie Preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగశౌర్య, షామిలి జంటగా తెరకెక్కిన ‘అమ్మమ్మగారిల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది. దాదాపు సంవత్సర కాలంగా ఈ సినిమాను నాన్చుతూ వస్తున్నారు. నాగశౌర్య ‘ఛలో’ సినిమా కంటే ముందే ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. అయితే నిర్మాత ఆర్థిక ఇబ్బందులు మరియు దర్శకుడి వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో సమంత గెస్ట్‌ అప్పియరెన్స్‌ చేస్తున్నట్లుగా మొదట ప్రచారం జరిగింది. ఆ వార్తలు నిజం కాదని ఆ తర్వాత తేలిపోయింది. సమంత నటిస్తుందన్న కారణంగా సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రం విడుదల సమయంలో భారీ పబ్లిసిటీ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రతి తెలుగు ఇంట్లో కామన్‌గా వినిపించే అమ్మమ్మగారిల్లు పదంను టైటిల్‌గా పెట్టడంతో అందరు ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతున్నారు. సెలవుల్లో అమ్మమ్మగారింటికి వెళ్లని వారు ఉండరు. అలాంటి వారు అంతా కూడా ఈ సినిమాలో ఏదో మ్యాటర్‌ ఉండి ఉంటుందనే అభిప్రాయంతో సినిమా చూడాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. పైగా ఈ సినిమా కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమా నిర్మాణంకు ఒక మోస్తరుగా ఖర్చు చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం ప్రమోషన్‌ కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. వారి ఖర్చుకు ప్రతిఫలం దక్కడం ఖాయమనిపిస్తుంది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి. నాగశౌర్యకు ‘ఛలో’ తర్వాత మరో కమర్షియల్‌ సక్సెస్‌ను ఈ చిత్రం అందిస్తుందనే నమ్మకను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మరి అది సాధ్యం అయ్యేనా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.