ఇలియానాకు శ్రీను అంతిస్తున్నాడా?

Ileana Received Huge Remuneration From ravi teja and srinu vaitla movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా మొదట అను ఎమాన్యూల్‌, శృతిహాసన్‌ను ఎంపిక చేయడం జరిగింది. అను ఎమాన్యూల్‌ కొన్ని వారాల పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. అను తప్పుకోవడంతో పలు రకాల పుకార్లు షికారు చేశాయి. మీడియాలో అనేక ఊహాగాణాలు తెరపైకి వచ్చాయి. అను ఎమాన్యూల్‌ స్థానంలో గోవా బ్యూటీ ఇలియానాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగులో పలు సూపర్‌ హిట్స్‌ను చేసిన ఇలియానా ఇప్పటి వరకు రవితేజతో మూడు సినిమాల్లో నటించింది. అందులో రెండు ఫ్లాప్‌ కాగా ‘కిక్‌’ సూపర్‌ హిట్‌ను అందుకుంది. రవితేజతో నాల్గవ సారి నటించబోతున్నందుకు ఇలియానాకు ఏకంగా రెండు కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇలియానా బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్స్‌ను అందుకుంది. కాని ఈమద్య కాలంలో ఆమె సరైన అవకాశాలు లేక చివరకు పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కెరీర్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని భావిస్తున్న సమయంలో ఇలియానాకు శ్రీనువైట్ల నుండి ఆఫర్‌ రావడం, అందుకు ఆమె ఓకే చెప్పడం జరిగింది. బాలీవుడ్‌లో దాదాపు నాలుగు, అయిదు కోట్ల పారితోషికాలను అందుకు ఇలియానా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలంటే రెండు కోట్లు డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇలియానా ఉంటే సినిమా క్రేజ్‌ పెరగడంతో పాటు, రవితేజకు సరైన జోడీ అనిపించుకుంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. శ్రీనువైట్ల రెండు కోట్లతో ఇలియానాను ఎంపిక చేయడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. హీరోయిన్స్‌ కోసం ఏకంగా 3.25 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంత బడ్జెట్‌ ప్రస్తుతం శ్రీనువైట్లకు మంచిది కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.