‘నేలటికెట్‌’ ప్రివ్యూ

Nela Ticket movie Preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రవితేజ, మాళవిక శర్మ జంటగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘నేటికెట్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ గత చిత్రాలు ‘సోగ్గాడే చిన్ని నాయన’ మరియు ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. దాంతో ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు నమ్మకంతో ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది. అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్‌ అవ్వడంతో నిర్మాతకు విడుదలకు ముందే లాభాలు దక్కినట్లుగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

‘టచ్‌ చేసి చూడు’ చిత్రంతో రవితేజ భారీ డిజాస్టర్‌ను చవి చూశాడు. అయినా కూడా ప్రేక్షకులు రవితేజ మరోసారి మాస్‌ హీరోగా ప్రూవ్‌ చేసుకుంటాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో కొత్త ముద్దుగుమ్మ మాళవిక శర్మ గ్లామర్‌ హైలైట్‌గా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా మాస్‌ ప్రేక్షకులను టార్గెట్‌ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్‌ మరియు టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నేల టికెట్‌ అంటేనే మాస్‌కు సింబల్‌. ఆ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలంటే మరి కొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే. రవితేజ మరో మాస్‌ సక్సెస్‌ను ఈ చిత్రంతో అందుకుంటాడని దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ నమ్మకంతో చెబుతున్నాడు. ఆయన ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.