అమ్మాయి మోజులో.. ఆ లింక్ ఓపన్ చేయగా.. రూ..96 వేలు మాయం

Business person logging in to his laptop

ఓ అమ్మాయి కోసం కక్కుర్తి పడి ఏకంగా రూ.96 వేల పొగొట్టుకున్నాడు హైదరాబాదీ. అదెలాగంటే.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిపై మనసుపడిన హైదరాబాద్ యువకుడు ఆమెతో రోజూ ఛాటింగ్ చేస్తున్నాడు. మెసేంజర్‌లో ఆమె పంపిన లింక్ ఓపెన్ చేయగానే అతడి బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.96వేలు మాయమైపోయాయి.

అయితే ఫేస్‌బుక్‌లో యువతి పేరుతో ఓ వ్యక్తికి గాలం వేసిన సైబర్‌ నేరస్థులు ఏకంగా రూ.96వేలను కాజేశారు. హైదరాబాద్ బొల్లారానికి చెందిన యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. ఇద్దరూ కొన్నిరోజుల పాటు చాటింగ్‌ చేసుకున్నారు. అమ్మాయా..? అబ్బాయా? అని నిర్ధారించుకొనేందుకు వాయిస్‌ కాల్‌ చేశాడు. అమ్మాయి గొంతు వినిపించడంతో ఫోన్‌ నంబర్‌ తీసుకొని మాట్లాడాడు. కొద్దిరోజుల తర్వాత అతడికి ఫేస్‌బుక్ మెసేంజర్ నుంచి ఓ లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే అతడి బ్యాంక్ అకౌంట్లో రూ.96వేలు మాయమైపోయాయి. దీంతో అనుమానం వచ్చిన అతడు ఆ యువతికి మెసేజ్‌లు పెట్టగా ఎలాంటి సమాధానం రాలేదు. ఆమె ఫోన్ నంబర్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోంది. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా హైదరాబాద్‌లోనే మరో వ్యక్తి కూడా ఈ మధ్య పేటీఎం కేవైసీ చేసుకోవాలని.. లేదంటే ఖాతా సేవలు నిలిచిపోతాయని సైబర్‌ నేరస్థుడు ఫోన్‌ చేశాడు. ఓటీపీలు చెప్పడంతో అతడి బ్యాంక్ అకౌంట్‌ నుంచి రూ.62వేలు మాయమైపోయిన విషయం తెలిసిందే.