షాక్ లో ఉన్న మెగాస్టార్ అభిమానులు

షాక్ లో ఉన్న మెగాస్టార్ అభిమానులు

మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. దొరికిన సమయం అంతా భవిష్యత్ ప్రణాళిక పైనే పూర్తి శ్రద్ద పెడుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు లేవు. అయితే ఇదే సమయంలో చిరు తాను కొరటాల శివ తర్వాత చేయబోయే చిత్రాల సంఖ్యను పెంచినట్లు తెలుస్తోంది. తాజాగా చిరు తన ఇంట్లోనే కొంతమంది తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ లో కొరటాల శివ తో పాటుగా సాహొ సుజిత్, బాబీ లతో సినిమాలు చేస్తున్నట్లు ఇదివరకు తెలిసిందే. అయితే తాజా గా ఈ లిస్టులో మెహర్ రమేష్ జాయిన్ అయ్యారు.

మెహర్ రమేష్ ఒక్క బిల్లా మినహా అన్ని చిత్రాలు ఫ్లాప్. బిల్లా కూడా రీమేక్ మూవీ అవ్వడం తో కొంత కలిసి వచ్చింది. అయితే ఇపుడు మెగా అభిమానులు ఈ విషయం పై శకో ఉన్నారు. ఒక ఫ్లాప్ దర్శకుడితో చిరు సినిమా ఎంటి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. చిరు వీరితో పాటుగా హరీశ్ శంకర్, సుకుమార్, పరశురామ లాంటి దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వారు కొత్తగా చూపించే అవకాశం ఉందని చిరు తెలిపారు. వాళ్ళ పని తీరు పట్ల చిరు చాలా ఆసక్తి చూపుతున్నారు. మరి లాక్ డౌన్ తర్వాత చిరు ఏ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారో చూడాలి.