ఇంటి పనులు చేస్తున్న తారక్

ఇంటి పనులు చేస్తున్న తారక్

ఇప్పుడు మన టాలీవుడ్ లో ఒక ఛాలెంజ్ నడుస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ లాక్ డౌన్ సమయంలో తన ఇంట్లో పనులు చేసి తాను కూడా కొంత మందికి ఛాలెంజ్ చేస్తున్నా అని మొదటిగా దర్శక ధీరుడు రాజమౌళికి ఛాలెంజ్ విసిరారు. దానితో రాజమౌళి వెంటనే స్పందించి తాను కూడ ఇంటి పనులు చేసి తన సినిమా హీరోలు తారక్ మరియు రామ్ చరణ్ లకు ఛాలెంజ్ విసరగా..

ఇప్పుడు తారక్ దానిని పూర్తి చేసి మన టాలీవుడ్ మూలాల స్తంభాలు నలుగురు అగ్ర హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి బాబాయ్ బాలయ్యకు అలాగే నాగార్జున బాబాయ్ కు మరియు వెంకటేష్ వరకు నలుగురిని కవర్ చేసేసి వారు కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలి అని తెలిపారు. “బీ ది రియల్ మెన్” అంటూ సాగుతున్న ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. “మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం.” అంటూ తారక్ విసిరిన ఈ ఛాలెంజ్ మన అగ్ర హీరోల్లో ఎవరు ముందు చేస్తారో చూడాలి.