తలైవా కోసం పాట పాడిన తారక్

తలైవా కోసం పాట పాడిన తారక్

తొలిసారిగా ‘యమదొంగ’ కోసం కీరవాణి సంగీత నిర్దేశకత్వంలో ‘ఓలమ్మీ తిక్క రేగిందా’ అంటూ ఓ పాట అందుకున్నాడు తారక్. కానీ అందులో అతడి గొంతు అంత శ్రావ్యంగా ఏమీ అనిపించదు.కానీ ‘కంత్రి’ సినిమా కోసం మణిశర్మ సంగీత దర్శకత్వంలో పాడిన టైటిల్‌ సాంగ్‌కు మాత్రం మంచి స్పందనే వచ్చింది. ఆ తర్వాత తమన్ అతడితో ‘రభస’ సినిమాకు రాకాసి రాకాసి పాట పాడితే.. అది కూడా హిట్టయింది. ఆపై ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ‘ఐ వానా ఫాలో ఫాలో..’ అంటూ మరో పాట అందుకున్నాడు.

ఇప్పుడు తారక్ మరోసారి బయటి సినిమా కోసం పాట పాడబోతున్నాడన్నది తాజా సమాచారం. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘మాస్టర్’ కోసం అతణ్ని పాట పాడమని అడుగుతున్నాడట సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఈ సినిమా నుంచి తమిళంలో ఒరు కుట్టి స్టోరీ అంటూ ఓ పాట రిలీజ్ చేశారు.అనిరుధ్‌కు తొలిసారి మంచి పేరు తెచ్చిన ‘కొలవరి’ స్టయిల్లో ఈ పాట సాగింది. తమిళంలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ పాటను తెలుగులో ఎన్టీఆర్‌తో పాడించాలనుకుంటున్నారట.