సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో సెటైర్లు… RRR సినిమా

సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో సెటైర్లు... RRR సినిమా

ఇప్పుడు రాజమౌళి సినిమా అంటేనే సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరికీ వెటకారం అయ్యిపోయింది. బాహుబలి తో మొదలైన పోస్ట్ పోన్ అనే సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు రాజమౌళి.తాము పడ్డ కష్టం అంతా ఇంకా మెరుగ్గా చూపించే ప్రయత్నంలో ముందు ఒక మాట ఇచ్చేసి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుతున్నారు.దీనితో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో సెటైర్లు పడడం మొదలయ్యాయి.ఇదిలా ఉండగా ఇప్పుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో RRR అనే భారీ విజువల్ వండర్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా లైన్ లో ఉండగానే తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమాను స్టార్ట్ చేసేసాడు.దానికి తోడు ఈ చిత్రాన్ని కూడా 2021లోనే విడుదల చేస్తామని ప్రకటించగా ఇక్కడ నుంచి సెటైర్లు మొదలయ్యాయి.RRR కన్నా ఇదే ముందు విడుదల అవుతుంది అని రాజమౌళి మరోసారి వాయిదా వేసినా ఆశ్చర్యపడక్కర్లేదని పేస్ బుక్ పేజెస్ లో మేమ్స్ ఒక రేంజ్ లో పడుతున్నాయి.ఇలా తారక్ దెబ్బకు రాజమౌళి పై మరోసారి నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే వీరు ఇలా ఎన్ని అనుకున్న అవి కేవలం అప్పటికప్పుడు వినోదం కోసమే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసేవి అయితే కాదని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.