కోటి రూపాయల ఆర్థికసాయం …కమల్‌ హాసన్‌

కోటి రూపాయల ఆర్థికసాయం ...కమల్‌ హాసన్‌

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు. ఈ షూటింగ్ చిత్రీకరణ నిన్న చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా క్రేన్ కింద పడటంతో ముగ్గురు వ్యక్తులు అసిస్టెంట్ డైరెక్టర్స్ మధు(28), కృష్ణ(34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60) అక్కడికక్కడే చనిపోగా, మరో పదిమందికి గాయాలు అయ్యాయి.

అయితే ఈ సంఘటన జరగడంతో చిత్ర బృందం తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తుంది. అయితే మృతిచెందిన వారి కుటుంబాలకు హీరో c కోటి రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు. అంతేకాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన కమల్ మీడియాతో మాట్లాడుతూ నా స్వంతంగా నేను మరణించినవారికి 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాను నేను ఇప్పుడు చేయగలిగేది ఇదే అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఎన్నో కోట్ల ఖర్చు పెట్టి సినిమాని చేస్తున్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నా, సినిమా కోసం పనిచేసే వాళ్లకి మాత్రం సరైన రక్షణ ఇవ్వలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నామని అన్నారు. అయితే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పుకొచ్చారు.