మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్

మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్

ఈరోజు శివరాత్రి పర్వదినంతో లాస్ట్ ఇయర్ క్రేజీ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” చిత్రం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది.రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన పక్కా మాస్ మసాలా చిత్రం అయినటువంటి ఈ సినిమాలో శివ తాండవ క్లైమాక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనుకుంటే మరో పక్క యూట్యూబ్ లో కూడా దుమ్ము దులిపేస్తుంది.ఇప్పటికే మొదటి రోజు రికార్డు స్థాయి వ్యూస్ ను రాబట్టుకున్న ఈ చిత్రం మూడు రోజుల్లోనే 45 మిలియన్ వ్యూస్ మార్కును కూడా అందుకుంది.

అయితే మన తెలుగు హీరోల తాలూకా చిత్రాలు డబ్ అయ్యి హిందీలో ప్రసారం అయ్యిన వాటిలో 1 మిలియన్ లైక్స్ అందుకున్న చిత్రాలు పెద్దగా లేవు.ఇటీవలే విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” హిందీ డబ్బుడ్ వెర్షన్ అతి తక్కువ కాలంలో ఈ ఫీట్ సాధించి రికార్డు కొట్టింది.కానీ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమా స్పీడ్ చూస్తుంటే విజయ్ రికార్డు బద్దలయ్యిపోయేలా ఉంది అనిపిస్తుంది.విజయ్ కు రెండు వారల గడువు పట్టగా రామ్ కు కేవలం నాలుగు రోజుల్లోనే 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చేసాయి.అంటే ఈ లెక్కన అతి త్వరలోనే విజయ్ సెట్ చేసిన రికార్డును రామ్ కొట్టెయ్యడం ఖాయమని చెప్పాలి.