నితిన్ కి బాగా కలిసొచ్చిన మహా శివరాత్రి

నితిన్ కి బాగా కలిసొచ్చిన మహా శివరాత్రి

ఈరోజే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నితిన్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “భీష్మ”. నితిన్ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ గా మారిన ఈ సినిమా కోసం నితిన్ అభిమానులు గట్టిగానే నిరీక్షించారు.అలాగే ఈసారి మాత్రం నితిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలని గట్టిగానే అనుకున్నారు.వీరితో పాటుగా తన అభిమానులను ఈసారి కూడా నిరాశ పరచకూడదని తాను కూడా ఈ మధ్య టాలీవుడ్ లో ట్రెండ్ గా మారిన సెంటిమెంట్లను ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు.

అలా తాను ఫాలో కాబడిన రెండు సెంటిమెంట్లు మూలాన ఇప్పుడు తాను కోరుకున్న హిట్లు అందుకున్నాడని అనిపిస్తుంది.ఇంతకు ముందు తన పేరులో ఇంగ్లీష్ అక్షరాల్లో నితిన్ లో ఒక్క “ఐ” మాత్రమే “హెచ్” పక్కన ఉండేది కానీ తాను సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఇంకొక “ఐ” చేర్చుకున్నాడు.అలాగే మరో సెంటిమెంట్ తన కెరీర్ లో దాదాపు ఒక దశాబ్దం పాటుగా సరైన హిట్ లేని సమయంలో ఇదే ఫిబ్రవరిలో “ఇష్క్” అనే చిత్రాన్ని విడుదల చేసి ఒక సాలిడ్ హిట్ ను నమోదు చేసుకున్నాడు.ఇప్పుడు మళ్ళీ ఇదే ఫిబ్రవరిలో విడుదల చేసి భీష్మ తో మరో హిట్టు అందుకున్నాడు.అయితే ఇదే సెంటిమెంట్లు ఇటీవలే “ప్రతిరోజూ పండగే” మరియు “అల వైకుంఠపురములో” చిత్రాలకు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.