తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కొందరు అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. అయితే రాష్ట్రంలోని ప్రతీ సామాన్యుడు కూడా ఎవరికీ, ఎటువంటి లంచం ఇవ్వకుండా సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నదే తన కోరిక అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాగా ఇక రాష్ట్రంలో మున్సిపల్ చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తామని, ఈ చట్ట పరంగా ఎవరైనా అధికారులు తప్పులు చేస్తే, వారి అధికారాన్ని కోల్పోతారని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఈనాటి తప్పిదాలు జరగకుండా అధికారులు తమ విధులను సక్రమంగా పూర్తి చేయాలనీ, ఏదైనా లోపాలు జరిగితే మాత్రం క్షణాల్లో చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.

ఇకపోతే అందరు కూడా తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, మన చుట్టూ పరిసరాల్లో ఎలాంటి చెత్త లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రత పై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని, ఈ విషయంలో ఇప్పటికే మనమందరం కూడా చాలా ముందున్నాం అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాల్ని కూడా రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, అందుకుగాను అందరు కూడా సహకరించాలని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.