రాజమౌళి ఇచ్చిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన రామ్ చరణ్

రాజమౌళి ఇచ్చిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన రామ్ చరణ్

ఇప్పుడు టాలీవుడ్ ఛాలెంజ్ ల పర్వం నడుస్తుంది. సందీప్ రెడ్డి వంగ మొదలు పెట్టిన బి ది రియల్ మెన్ అనే ట్రెండ్ లో భాగంగా రాజమౌళి ఇచ్చిన ఛాలెంజ్ ను ఈరోజు తన RRR హీరోలు ఇద్దరు పూర్తి చేసారు. ఉదయానికల్లా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూర్తి చేసేస్తే ఈరోజు మధ్యాహ్నానికి తాను కూడా పూర్తి చేసేసా అని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తెలిపారు.

అలా తాను రాజమౌళి ఇచ్చిన ఛాలెంజ్ ను పూర్తి చేసి ఆ వీడియోను తన సోషల్ మీడియా విభాగం ద్వారా పోస్ట్ చేసారు. అలా చేసి తాను కూడా కొంతమందికి ఈ ఛాలెంజ్ విసిరారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్,బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, అలాగే మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరియు యువ హీరో శర్వానంద్ లకు ఈ ఛాలెంజ్ ఇస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ ఛాలెంజ్ బాలీవుడ్ లో కూడా ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి.