కరోనా ను కట్టడి చేయడంలో అన్ని చర్యలు తీసుకుంటున్న కేసీఆర్

కరోనా ను కట్టడి చేయడంలో అన్ని చర్యలు తీసుకుంటున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే పలు కీలక విషయాల్ని సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేశారు. వైరస్ ఎంతగా ప్రభావం చూపుతుంది, ఎంత ప్రమాదకర వైరస్, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని పలు విషయాలు తేల్చి చెప్పారు.అంతేకాదు ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్త కుండ లాక్ డౌన్ కూడా పక్కగా జరిగేలా అమలు చేస్తున్నారు. కేంద్రం అవకాశం ఇచ్చిన లాక్ డౌన్ సడలించే ప్రసక్తి లేదని, మే 7 వరకు పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమయంలో విద్యా సంస్థలకు ఫీజులు పెంచకుండా, అద్దె వసూలు చేయడం కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా కాదు అని ప్రభుత్వం తీసుకున్న చర్యలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాక పేద ప్రజలకు 1500 రూపాయలు, రేషన్ అందజేస్తున్నారు. ఏదేమైనా విద్య సంస్థలు ఫీజులు పెంచకుండా, ఎక్కువగా వసూలు చేయకుండా చర్యలు తీసుకున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదేతరహాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తే బావుంటుంది అంటూ వ్యాఖ్యానించారు. మరి ఈ విషయంలో జగన్ కెసిఆర్ తరహాలో నిర్ణయాలు తీసుకుంటారా లేదా అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.