చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రముఖ యాంకర్

చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రముఖ యాంకర్

బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీ అనసూయ చిందులకు ఎంత డిమాండ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక వెండితెరపై తన స్టెప్పులతో హుషారెత్తించడంలో చిరంజీవిని మించిన హీరో లేదని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో చిందేస్తే..! అబ్బో.. ఆ కిక్కే వేరులే. అయితే అది నిజం చేసేలా ప్లాన్ రెడీ చేశారట డైరెక్టర్ కొరటాల శివ. ఆ వివరాలేంటో చూద్దామా..

తన ఒంపు సొంపులతో బుల్లితెరకు కొత్త శోభ తీసుకొచ్చిన అనసూయ.. వెండితెరపై కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. విలక్షణ పాత్రలు పోషిస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఇటు బుల్లితెర, అటు వెండితెర అన్నట్లుగా సాగుతున్న ఆమె ప్రయాణం మెల్లగా మెగా హీరోల కంట పడింది. దీంతో మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌గా మారింది అనసూయ.

ఇన్నాళ్లు బుల్లితెరపై మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి జబర్దస్త్ షోలో యమ హంగామా చేసిన ఈ జబర్దస్త్ బ్యూటీ.. ఇక మెగాస్టార్ చిరంజీవితో చిందులేసేందుకు రెడీ అయిందట. కొరటాల శివ- చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో అనసూయ కిక్ మరింత స్పెషల్ కానుందట.

‘ఆచార్య’ సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్ కోసం అనసూయను కన్ఫర్మ్ చేశారట కొరటాల. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. కాగా ఇదే సినిమాలో చిరంజీవి – రెజీనా కాంబినేషన్లో ఓ ఐటమ్ సాంగ్ షూటింగ్ ఇప్పటికే ఫినిష్ అయిన సంగతి తెలిసిందే.

చిరంజీవి – రెజీనాలపై షూట్ చేసిన ఆ ఐటమ్ సాంగ్.. ఇంటర్వెల్‌కి ముందు వచ్చేలా, అదేవిధంగా చిరంజీవి – అనసూయలపై షూట్ చేయబోయే ఈ స్పెషల్ సాంగ్ ఇంటర్వెల్‌ తర్వాత వచ్చేలా ప్లాన్ రెడీ చేశారట కొరటాల శివ. ఇందులో అనసూయ చాలా హాట్‌గా కనిపించనుందని, అందుకోసమే ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేశారని తెలుస్తోంది.