అమెరికా సెక్స్‌ రాకెట్‌లో అనసూయ..!

Anchor Anasuya About tollywood sex racket at us

అమెరికాలో తెలుగు హీరోయిన్స్‌ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతుంది. ఎవరికి వారు తాము ఆ సెక్స్‌ రాకెట్‌లో లేము అంటూ చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు హీరోయిన్స్‌ తమకు ఏ పాపం తెలియదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అనసూయ కూడా ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చేసింది. తాను గతంలో అమెరికా వెళ్లిన విషయం నిజమే కాని, దేవిశ్రీ ప్రసాద్‌ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక అమెరికాలో ఒక ఈవెంట్‌లో పాల్గొనాల్సిందిగా కిషన్‌ నుండి ఫోన్‌ కాల్‌ వచ్చిందని అనసూయ చెప్పుకొచ్చింది.

చాలా రోజుల క్రితం శ్రీరాజ్‌ను తాను అంటూ అమెరికా నెంబర్‌తో ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ ఫోన్‌లో వ్యక్తి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అమెరికాలో చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒక షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వారందరిని ఆనందింపజేసేందుకు మీరు రావాలి అంటూ ఫోన్‌లో కోరడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు కాస్త తేడాగా అనిపించడంతో నేను నో చెప్పాను. అతడు రెండు మూడు సార్లు కాల్‌ చేసినా కూడా తాను నో చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది. ఒక వేళ వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అంటూ సన్నిహితుల వద్ద చెబుతూ అనసూయ టెన్షన్‌ పడుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అనసూయ పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డట్లయ్యింది.