100 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసిన .. యాంకర్ ప్రదీప్ సాంగ్

100 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసిన .. యాంకర్ ప్రదీప్ సాంగ్

యాంక‌ర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?’ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ఆద‌ర‌ణ‌తో 100 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసింది.

అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చగా.. ‘నీలి నీలి ఆకాశం’ పాటతో స‌హా చిత్రంలోని అన్ని పాట‌ల‌నూ చంద్రబోస్ రాశారు. ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్‌పై చిత్రీక‌రించిన‌ ‘నీలి నీలి ఆకాశం’ పాట 100 మిలియ‌న్ వ్యూస్ దాట‌డంతో చిత్ర బృంద‌మంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు . టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఇదొక అరుదైన ఫీట్‌గా విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. స్టార్లు లేని ఒక చిన్న సినిమాలోని పాటకు ఈ స్థాయి ఆద‌ర‌ణ ల‌భించ‌డం గొప్ప విష‌యంగా వారు చెబుతున్నారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన విన‌సొంపైన బాణీల‌కు చంద్రబోస్ రాసిన క‌మ‌నీయ సాహిత్యం, సింగ‌ర్స్‌ సిద్ శ్రీ‌రామ్‌, సునీత సుమ‌ధ‌ర గానం తోడై ఈ పాట‌ను ఇంత బ్లాక్‌బ‌స్టర్ చేశాయ‌ని నిర్మాత ఎస్వీ బాబు అన్నారు. ఈ సంద‌ర్భంగా సంగీత ప్రియుల‌కు ఆయ‌న ధ‌న్యవాదాలు తెలిపారు.