లక్షల్లో జరుగుతున్న కరోనా పరీక్షలు

లక్షల్లో జరుగుతున్న కరోనా పరీక్షలు

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఐదువేలకు చేరువలో ఉన్నాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ మెడికల్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. రోజుకి లక్ష మందికి పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కరోనాను ఎదుర్కొనేందుకు పలు ఆవిష్కరణలకు కృషి చేస్తున్నట్లు చెప్పింది. పీసీఆర్‌ మిషన్ల ద్వారా పరీక్షలు జరిపేందుకు ఇప్పటికి 200 పబ్లిక్‌, ప్రైవేటు ల్యాబులకు అనుమతులిచ్చింది.

ఎక్కడైతే పాజిటివ్‌ కేసులు వచ్చాయో ఆయా ప్రాంతాల్లో ప్రతీ రోజు సర్వే నిర్వహించాలని, అనుమానితులకు తప్పని సరిగా పరీక్షలు నిర్వహించాలని అధికారులు సిద్ధమవుతున్నారు. కోవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌కు చెందిన ల్యాబ్స్‌ను, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్స్, మెడికల్ కాలేజీలను గుర్తిస్తున్నామన్నారు. ఏవైతే… కోవిడ్ పరీక్షలకు అనువైన ప్రాంతాలుగా ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

దీంతో పాటు కరోనా పరీక్షల కోసం 24×7 ల్యాబ్స్ అందుబాటులో ఉండేలా చూస్తామంటున్నారు. కరోనా కోసం పనిచేస్తున్న వారి సంఖ్యను కూడా పెంచాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్ాడి… డేటా ఎంట్రీ నుంచి మాన్యువల్ పీసీఆర్ ఆపరేషన్స్ వరకు పనిచేసే వారి సంఖ్యనె పెంచాలనుకుంటున్నారు. మొత్తం మీద కరోనా కోసం భారత యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4800 దాటాయి.