“అనిమల్” రన్ కి ఎండ్ కార్డు.!

“అనిమల్” రన్ కి ఎండ్ కార్డు.!
Animal Movie

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన పలు భారీ హిట్ సినిమా ల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అలాగే రష్మిక మందన్నా హీరోయిన్ గా టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కించిన వైల్డ్ హిట్ సినిమా అనిమల్ కూడా ఒకటి. మరి ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వసూళ్లు చాలా మంది 900 నుంచి 1000 కోట్ల వరకు వెళ్తాయని భావించారు. కానీ ఇది మాత్రం ఇప్పుడు సాధ్యమయ్యే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు . ఎందుకంటే ఆల్రెడీ బాలీవుడ్ లో బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా “డంకి” రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ నే సంతరించుకుంది.

“అనిమల్” రన్ కి ఎండ్ కార్డు.!
Animal Movie

ఇక ఇది కాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ డ్రామా “సలార్” కూడా వచ్చి సెన్సేషనల్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి వీటితో అయితే అనిమల్ సినిమా రన్ కి ఫైనల్ గా ఎండ్ కార్డు పడిపోయినట్టే అని చెప్పుకోవాలి . ఒకవేళ రన్ అయినా కూడా సుమారు 900 కోట్ల మేర వచ్చి ఆగిపోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.