బాక్సాఫీస్ వణికిస్తోంది.. “సలార్” డే 1 మెగా కలెక్షన్స్

బాక్సాఫీస్ వణికిస్తోంది..
Cinema News

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “సలార్” ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్స్ లో పడిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎన్నో అంచనాలు నడుమ విడుదల కాగా ఈ అంచనాలు రీచ్ అయ్యే దిశగా ఇప్పుడు వెళ్తుంది.

అయితే డే 1కి ఈ సినిమా ఇండియా వైడ్ గా రికార్డు బుకింగ్స్ అందుకున్న సంగతి అందరికి తెలిసిందే. అలాగే ఒక్క ఇండియా లోనే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా “సలార్” సినిమాకి మాసివ్ బుకింగ్స్ అయితే నమోదు అయ్యాయి. ఇక దీనితో ఈ సినిమా కి రికార్డు ఓపెనింగ్స్ అయితే ఖాయం అయ్యిపోయాయి.

బాక్సాఫీస్ వణికిస్తోంది.. "సలార్" డే 1 మెగా కలెక్షన్స్
Salaar Movie

మరి ప్రస్తుతానికి ఉన్న స్వింగ్ లో అయితే ఈ సినిమా కి వసూళ్లు డెఫినెట్ గా ఈజీగా 100 కోట్ల గ్రాస్ కేక్ వాక్ కాగా 150 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా ఈజీగా అందుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ సినిమా సెన్సేషనల్ మార్క్ 200 కోట్ల గ్రాస్ ని అందుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. మరి చూడాలి మేకర్స్ ఎలాంటి నెంబర్ రివీల్ చేస్తారో అనేది.