టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ విజువల్ వండర్ చిత్రం

టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ విజువల్ వండర్ చిత్రం

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ విజువల్ వండర్ చిత్రం “RRR”. దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు మాస్ హీరోల కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే తారా స్థాయి అంచనాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా బాహుబలి తర్వాత మరోసారి అదే స్థాయి అగ్ర తారాగణంతో రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి.ఇటీవలే ఈ చిత్ర యూనిట్ లోకి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ సెట్స్ లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈరోజు అజయ్ దేవ్ గన్ సెట్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.అందులో ఒక చిన్న బాబుతో కలిసి ఉన్నారు.దీనితో ఒక క్లారిటీ ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ వస్తుంది.గతంలో అజయ్ పాత్రపై కొన్ని ఊహాగానాలు వినిపించాయి.

అజయ్ ఈ సినిమాలో అల్లూరి పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు గురువుగా కనిపించనున్నారని అప్పుడు వార్తలు చక్కర్లు కొట్టాయి.ఇప్పుడు అవి మరింత బలపడేలా రామ్ చరణ్ చిన్నప్పటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని అంటున్నారు.చూస్తుంటే ఈ అనుమానాలు కాస్త నిజమే అనిపిస్తుంది.మరి ఏది ఏమైనా కానీ రాజమౌళి ఏం చేస్తున్నారో తెలియాలి అంటే ఈ చిత్రం వచ్చే వరకు ఆగక తప్పదు.