సమంతకు మరో వ్యాధి..? ఈసారి ఆమెను దేవుడే కాపాడాలి

సమంత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటన, డ్యాన్స్, క్యూట్ మాటలు, తన అంద చందాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ఏ మాయ చేసావే” సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని అనివార్య కారణాలవల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

సమంతకు మరో వ్యాధి..? ఈసారి ఆమెను దేవుడే కాపాడాలి - Telugu Bullet

ఇక విడాకుల అనంతరం సమంత మయోసైటిస్ వ్యాధిబారిన పడింది. ఈ వ్యాధికి అమెరికాలో చికిత్స తీసుకుంటుంది. ఇక ఈ వ్యాధితోనే పోరాడుతున్న సమంత మధు మరో వ్యాధి బారిన పడిందట. ఈ వ్యాధి పెద్దగా తీవ్రమైనది కానప్పటికీ తనకి కోపం వచ్చినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయట.

తనకి విపరీతంగా కోపం వచ్చినప్పుడు తన చేతిలో ఏది ఉన్న దాన్ని విసిరేయడం, తన ఎదురుగా ఎవరు ఉన్నా వారిని పెద్దగా పట్టించుకోవడం వంటివి జరుగుతున్నాయట. ఇక ఈ వ్యాధికి కూడా సమంత ట్రీట్మెంట్ తీసుకుంటుందని సమాచారం అందుతుంది. ఇక సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పటికీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. తాజాగా సమంత నటించిన ఖుషి చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.