“పెద్ద కాపు 1” స్పెషల్ ప్రీమియర్ కి పాజిటివ్ రెస్పాన్స్!

“పెద్ద కాపు 1” స్పెషల్ ప్రీమియర్ కి పాజిటివ్ రెస్పాన్స్!
Movie News

విరాట్ కర్రా మరియు ప్రగతి శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పెద్ద కాపు 1. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షో నిన్న రాత్రి జరిగింది. దీనికి ఆడియెన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

“పెద్ద కాపు 1” స్పెషల్ ప్రీమియర్ కి పాజిటివ్ రెస్పాన్స్!
Pedda Kapu-1

ఈ రోజు రాత్రి హైదరాబాద్‌లో పెయిడ్ ప్రీమియర్ షో ఉంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా కి సినిమాటోగ్రాఫర్‌గా ఛోటా కె నాయుడు, ఎడిటర్‌గా మార్తాండ్ కె వెంకటేష్, సమర్పకుడిగా మిర్యాల సత్యనారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.