సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్‌కు అన్నగా ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్‌కు అన్నగా ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట
Latest News

సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అందమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నడు పాత్రలో నటించగా మహేష్ బాబు అన్నగా వెంకటేష్ నటించాడు. సమంత హీరోయిన్ గా నటించిన సీతమ్మవాకిట్లో సిరి మల్లె చెట్టు సినిమాలో అంజలి మరో హీరోయిన్ గా నటించింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, తనికెళ్ళ భరణి ఇతర పాత్రల్లో మెప్పించారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్‌కు అన్నగా ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట
Venkatesh, Mahesh babu

మిక్కీజే మేయర్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముందుగా ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర కోసం మరో హీరోను అనుకున్నారట. వెంకటేష్ పాత్ర కోసం ఓ బడా స్టార్ ను అనుకున్నారట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల . మహేష్ కు అన్నగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అనుకున్నారట శ్రీకాంత్ అడ్డాల.. పవన్ ను దృష్టిలో పెట్టుకొనే పెద్దోడు పాత్రను డిజైన్ చేశారట.. కానీ పవన్ తో అది కుదరలేదట. దాంతో ఈ ప్రాజెక్ట్ లోకి వెంకటేష్ వచ్చారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసి ఉంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది అంటున్నారు ఫ్యాన్స్. ఇద్దరు బడా హీరోలే కాబట్టి ఫ్యాన్స్ కూడా సంతోషించేవారని అంటున్నారు.