ఏపీ ప్రజలకు శుభవార్త..జనవరి 15న విశాఖ మెట్రోకు శంకుస్థాపన

TS Politics: Hyderabad Metro made a key announcement..!
TS Politics: Hyderabad Metro made a key announcement..!

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. ఏపీలోనే తొలిసారి విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు జనవరి 15న ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. తొలి విడతలో రూ. 76 కి.మీ లైట్ మెట్రో నిర్మాణానికి 9,699 కోట్ల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసింది. తోలుతా 42 స్టేషన్లతో 3 కారిడార్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర చరిత్ర, సాంస్కృతి ప్రతిబింబించేల పిల్లర్ల నిర్మాణం జరగనుంది. ఇందుకు వీలుగా నిధుల సమీకరణ వేగవంతం చేయాలని మెట్రో రైల్ కార్పొరేషన్ ను ప్రభుత్వము ఆదేశించింది.

కాగా, రేపు వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. ఇందులో భాగంగానే.. రేపు ఉదయం 10.15 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమం జరుగనుంది. ఇక సీఎం జగన్ ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.