ఎ.ఎన్.ఆర్ ని గుర్తు చేసుకున్న అక్కినేని కుటుంబం

ఎ.ఎన్.ఆర్ ని గుర్తు చేసుకున్న అక్కినేని కుటుంబం
 ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి.1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాలోని రామాపురంలో జన్మించారు నాగేశ్వరరావు. 1941లో వచ్చిన ‘ధర్మపత్ని’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు నాగేశ్వరరావు. ఆయన కెరీర్‌లో దాదాపు 244 సినిమాల్లో నటించారు.
ఈ సందర్భంగా ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ట్విటర్ వేదికగా ఎమోషన్ పోస్ట్ పెట్టారు. . ఈరోజు నాన్న పుట్టినరోజు. మమ్మల్ని మీ జీవితంలో భాగస్వామ్యులుగా చేసుకున్నందుకు థ్యాంక్యూ. మిమ్మల్ని మిస్సవుతాం. మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం’ అని పేర్కొన్నారు.
అక్కినేని కోడలు సమంత కూడా ఏఎన్నార్‌ను గుర్తుచేసుకున్నారు. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్‌లో ఎ.ఎన్.ఆర్ నటించిన సినిమల్లోని పాత్రలన్నీ కలిపిన ఫొటోలన్నీ కలిపి ఉన్న ఇమేజ్‌ను పెట్టుకున్నారు. ఏఎన్నార్ మనవడు, నటుడు సుశాంత్ కూడా తన తాతగారితో ఉన్న అనుబంధాలను ట్విటర్‌లో పంచుకున్నారు
చిన్నప్పుడు తన తాతగారితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే తాతా.. నేను మీ జీవితంలో కొంతకాలమే భాగమై ఉన్నప్పటికీ ఎంతో గొప్పగా ఫీలవుతున్నాను. మరింత కష్టపడేలా మీరు మాలో స్ఫూర్తి నింపారు. మీరు మా హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారు’ అని పేర్కొన్నారు.
1949 ఫిబ్రవరి 18న నాగేశ్వరరావు అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకొన్నందుకు ఆమె కుటుంబానికి ఎప్పటికీ రుణ పడి ఉంటానని, ఆమెపై ప్రేమతోనే తన వ్యాపార సంస్థలన్నింటికీ అన్నపూర్ణ అని నామకరణం చేశానని నాగేశ్వరరావు చాలా సందర్భాల్లో చెప్పారు.  2014 జనవరి 22న ఏఎన్నార్ చివరి శ్వాస విడిచారు.