ఇంట్లోని సభ్యులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్

ఇంట్లోని సభ్యులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్

బిగ్‌బాస్‌ ఇచ్చిన క్రేజీ కాలేజీ టాస్క్‌లో బెస్ట్‌ టీచర్‌గా బాబా భాస్కర్‌, బెస్ట్‌ స్టూడెంట్‌గా మహేశ్‌ ఎంపికయ్యారు.  అదేవిధంగా మహేశ్‌కు ఒక చాన్సిచ్చి చూద్దాం అని భావించిన ఇంటి సభ్యులందరూ మహేశ్‌కు  కెప్టెన్‌గా గెలిపించారు. ఇక కెప్టెన్‌ మహేశ్‌.. సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కెప్టెన్‌ మీటింగ్‌ పెట్టే ఆలోచనలో ఉన్నాడు.

బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టి 60 రోజులు పూర్తయినందున ఫ్యామిలీని మిస్‌ అవుతున్న ఇంటి సభ్యుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ సిద్ధం చేశాడు.అయితే ఓ మెలిక కూడా పెట్టాడు. ఇంటి సభ్యులు ఎవరూ మాట్లాడటానికి వీలులేదని తెగేసి చెప్పాడు. అనంతరం వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను చూపించగా ఇంటి సభ్యులందరూ ఉద్వేగానికి లోనయ్యారు.

శ్రీముఖి, శివజ్యోతిలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇక పార్టిసిపెంట్స్‌ను కలవడానికి వచ్చిన కుటుంబ సభ్యులతో బిగ్‌బాస్‌ గేమ్‌ ఆడించనున్నాడు. అందులో భాగంగా అయిదింటిలో జోకర్‌, అయిదింటిలో ఐ లోగో ఉన్న బాక్సులను ఏర్పాటు చేశాడు. ఐ లోగో వచ్చిన వారితో గేమ్‌ ఆడించి అందులో గెలిచిన ఇద్దరికి మాత్రమే ఇంట్లోకి వెళ‍్లే అవకాశముందని చెప్పాడు. ఇప్పటికే వితిక లక్కీ చాన్స్‌ కొట్టేసింది. కాగా వితిక, రవిలకు ఇంటిసభ్యులను కలుసుకునే గోల్డెన్‌ చాన్స్‌ దక్కిందని సమాచారం!